బాహుబలి సినిమాలో కట్టప్ప గా సత్యరాజ్ చేసిన నటనకు భారతదేశం మొత్తం ఆయనకు సెల్యూట్ చేసింది. ఆ పాత్రలో తాను తప్ప ఇంకెవరూ నటించ లేరు అన్న రీతిలో సత్యరాజ్ నటించి ప్రేక్షకుల్లో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. సత్యరాజ్ అంతకుముందు కొంత మందికి తెలిసినా ఇప్పటి తరానికి సత్యరాజ్ గురించి ఆయన చేసిన సినిమాల గురించి పెద్దగా తెలియదు. ఆయన అసలు పేరు రంగరాజు సుబ్బయ్య. తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించే ఈయన మొదట్లో విలన్ గా తన సినిమా జీవితాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు కీలకమైన పాత్రలు పోషించారు.

ఇప్పటి వరకు 200 సినిమాలకు పైగా నటించిన ఈయన తెలుగు కన్నడ మలయాళ హిందీ భాషల్లో నటించి దేశమంతటా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తెలుగులో బాహుబలి కంటే ముందు శంఖం లాంటి సినిమాలలో నటించాడు. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత సినిమాల్లోకి వెళ్తానంటే ఆయన తల్లి అంగీకరించలేదు అయినా కాదని 1976లో సినీ రంగంలో ప్రవేశించడం కోసం చెన్నై బయలుదేరాడు. అలా సినిమా కోసం చెన్నైకి చేరిన సత్య రాజ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండగా తనకు పరిచయం అయిన వారితో స్నేహంగా ఉంటూ సినిమా ఛాన్స్ లు సంపాదించుకొని మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసే వారు.

అలా కథానాయకుడిగా ఆయన 1985లో వచ్చిన సావి సినిమా తో మొదలై 75 సినిమాల దాకా హీరోగా నటించాడు. అంతే కాదు హీరోగా చేస్తున్న సమయంలోనే విలన్ గా కూడా నటించాడు. ఇప్పుడు అన్ని భాషలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నాడు సత్యరాజ్. ఏదేమైనా సత్యరాజ్ రూపంలో ఇండియన్ సినిమా పరిశ్రమకు ఒక మేలైన నటుడు దొరికాడని చెప్పవచ్చు. ఏ భాషలో అయినా ఇట్టే ఒదిగిపోయి నటించి ప్రేక్షకులను మెప్పిస్తాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: