ఇక సుడిగాలి సుదీర్ మల్టీ టాలెంట్ కి అటు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఫిదా అయిపోయి అభిమానులుగా మారిపోతున్నారు. ఓవైపు జబర్దస్త్ లో కామెడీ మరోవైపు ఢీ లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇంకోవైపు మ్యాజిక్ షోలు మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ లో యాంకరింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే సుడిగాలి సుధీర్ కి అస్సలు రానిది అంటూ ఏదీ లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒకప్పుడు పోవే పోరా అనే కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్ యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ సోలో యాంకరింగ్ చేస్తూ అందరిని అలరిస్తుంది.
అయితే ఒకప్పుడు విష్ణుప్రియ తో కలిసి సుడిగాలి సుదీర్ చేసిన పోవే పోరా కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఎన్నో రోజుల పాటు టాప్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ప్రతి వారం కూడా ప్రేక్షకులను సరికొత్త కాన్సెప్ట్ తో అలరించేవారు. ఇక ఆ తర్వాత కరోనా సమయంలో ఈ కార్యక్రమం కాస్త ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి విష్ణు ప్రియ సుడిగాలి సుదీర్ ఇక ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. పోవే పోరా అనే కార్యక్రమంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి