తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న దర్శకులలో తేజ ఒక్కరు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో వెరైటీ కథనాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. అంతేకాదు.. తేజ తన సినిమాల ద్వారా ఎంతోమంది కొత్త నటులకు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. తేజ మొదట ఇండస్ట్రీలో లైటింగ్ అండ్ సౌండ్ డిపార్టమెంట్ లో పనిచేసి.. ఆ తర్వాత కెమెరా డిపార్డ్ మెంట్ లో కొద్దికాలం పని చేశారు. అంతేకాదు.. హిందీ, తెలుగు ఇండస్టీలో కెమెరా మెన్ గా పలుచిత్రాలకు పని చేశారు. ఇక రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి శివ సినిమాకు పోస్టర్ లోగోను తయారు చేశాడు. అయితే కెమెరా మెన్ గా సక్సెస్ కొట్టిన తేజ దర్శకుడిగా చిత్రం సినిమాను తెరకెక్కించాడు.

అయితే వ్యక్తిగత విషయంలోకి వస్తే.. ఆయన 1966 ఫిబ్రవరి 22న మద్రాస్ లో జన్మించారు. ఇక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన తేజా.. ఎన్నో కష్టాలను అనుభవించారు. జీవితంలో కష్టాలనే మెట్లుగా చేసుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన సినిమాలో నటించే నటులను కొట్టిమరీ నటనను రాబట్టుకునేవాడు. అయితే తేజ జీవితంలో ఎవరికి తెలియని అత్యంత దారుణమైన విషాదం కూడా ఉంది. అందరికి తెలిసినంత వరకు తేజకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. అయితే వాస్తవానికి ఇంకొక కొడుకు కూడా ఉండేవాడట. కానీ.. డాక్టర్ల నిర్లక్ష్యంతో నాలుగేళ్ళ వయసులోనే మృతి చెందాడంట.

ఇక తేజ చిన్నబ్బాయి ఆరోవ్ తేజ శ్వాసకోశ సమస్య, సెరిబ్రల్ పక్షవాతంతో బాధపడుతూ మృతి చెందారు. ఇక తన కొడుకు ఇంత చిన్న వయసులోనే ఈ విధమైనటువంటి బాధను అనుభవిస్తూ మరణించడానికి గల కారణం చెప్పారు. అయితే ఆరోవ్ తేజ పుట్టినప్పుడు ఆసుపత్రిలోని డాక్టర్ల నిర్లక్ష్యం, తప్పిదం కారణంగా తనబిడ్డ అంత చిన్న వయసులోనే ఎంతో బాధను అనుభవించాడని ఓ సందర్భంలో తన కొడుకు పడిన బాధలను తేజ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: