ఒకప్పుడు అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో గా ఎదిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలోనూ విజయ్ దేవరకొండ ఎంతో క్రేజ్ ను మరియు అభిమానులను సంపాదించుకున్నారు. దాంతో ప్రస్తుతం బడా ప్రొడ్యూసర్లు విజయ్ దేవరకొండను వెతుక్కుంటూ వస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన రౌడీ హీరో బడా ప్రొడ్యూసర్లతో సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఇప్పటికే "లైగర్" అంటూ ఏకంగా కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే రౌడీ హీరో తాజాగా "రౌడీ బాయ్స్" సినిమా ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా త్వరలో దిల్ రాజు తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టు రౌడీ హీరో ప్రకటించారు. కేరింత సినిమా ఆడిషన్స్ జరుగుతున్నపుడు అవకాశాల కోసం తాను దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ కు వెళ్ళినట్లు విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. తను కేరింత సినిమాలో అవకాశం కోసం చాలా కష్టపడ్డానని కానీ అందులో అవకాశం రాలేదని వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత తను పెళ్లి చూపులు సినిమా లో హీరోగా నటించానని ఆ సినిమా విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. అయితే ఆ సినిమాను దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేయించాలని నిర్ణయించుకున్నామని కానీ అది కూడా కుదరలేదని విజయ్ దేవరకొండ తెలిపారు. ఒకప్పుడు తను దిల్ రాజు సినిమా లో ఒక చిన్న పాత్ర చేసినాచాలని ఎంతో కోరుకునే వాడిని అని చెప్పారు. అయితే ఇప్పుడు దిల్ రాజు మరియు తన కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా రాబోతుందని త్వరలోనే దానిపై అనౌన్స్మెంట్ ఉంటుందని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: