పవన్ కళ్యాణ్ ఒకసారి సినిమాలలో బిజీగా ఉంటాడు.. మరొకసారి తను స్థాపించిన జనసేన పార్టీలో బిజీగా ఉంటాడు.. ఇకపోతే దాదాపు మూడు నాలుగు సంవత్సరాల పాటు రాజకీయానికే తన జీవితాన్ని పరిమితం చేసినప్పటికీ.. ప్రజలలో అసాధారణమైన ప్రచారం చేసినా..సొంత నియోజకవర్గం నుంచి గెలుపొందలేకపోయాడు. ఆ తర్వాత తిరిగి సినీ ఇండస్ట్రీలోకి వకీల్ సాబ్ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఇకపోతే కరోనా సమయంలో కూడా అక్కడక్కడా థియేటర్లు మూత పడినా ఈ సినిమా విడుదల అయి మంచి కలెక్షన్లను రాబట్టింది.


ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు పవన్ కళ్యాణ్.. అంతేకాదు సినిమాలు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లకు గనుక ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే , అక్కడ కూడా తన రాజకీయ వ్యూహాలను అమలు పరుచుకుంటున్నాడు. ఇకపోతే ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడు. ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ తన 29వ సినిమాను ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత తన 30 వ సినిమా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తిరిగి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. భీమ్లా నాయక్ సినిమా తర్వాత వరుస 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇక ఈ సినిమాలలో సంపాదించిన డబ్బులను తిరిగి తన జనసేన పార్టీ కి ఖర్చు పెట్టాలని పవన్ కళ్యాణ్ వ్యూహం పొందుతున్నాడట.. ఇకపోతే సినిమాల ద్వారా వచ్చిన డబ్బులతో రాజకీయంగా ఎదగాలని ఆలోచన చేస్తున్నాడు అని, ఇటు సినీ ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయ నాయకులు కూడా గుసగుస లాడుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: