ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందనేది ఎప్పటినుంచో మన పెద్దలు చెబుతున్న విషయం. నిజంగా ఇది నిజమే కావచ్చు. ఎంతో మంది గొప్ప గొప్ప, విజయం సాధించిన వారి జీవితాలను గమనిస్తే వారి వెనుక తప్పకుండా పనిచేస్తూ ఉంటుంది.
సినిమా వారి విషయంలో కూడా ఇది అక్షరాలా సత్యం అనే చెప్పాలి. కొంతమంది
సినిమా వారి విజయాల విషయంలో మహిళలు కీలక పాత్రలు పోషిస్తూ ఉంటారు. వారి ఎదుగుదలకు వీరు కూడా ఎంతో సహకరిస్తూ ఉంటారు.
ముఖ్యంగా హీరోల భార్యలు వారి సినిమాల ఎంపికలో వారి ఎదుగుదల, ఎంపికల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ తమ
భర్త విజయం సాధించేలా చేస్తూ ఉంటారు. అలా
టాలీవుడ్ బెస్ట్ జోడిలలో
అల్లు అర్జున్ మరియు
స్నేహ రెడ్డి ల జోడీ కూడా ఒకటి. అల్లు వారి కోడలు అంటే ఎలా ఉండాలో నిరూపించి చూపించింది
స్నేహ రెడ్డి. ప్రేమించి
పెళ్లి చేసుకున్న వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా మెలుగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సినిమా వారి పెళ్లిళ్లు ఎక్కువసేపు నిలబడవు అనే వారికి సమాధానం చెబుతూ వీరిద్దరూ తమ సంసారాన్ని ఎంతో పచ్చగా ముందుకు సాగిస్తూ అందరికీ సరైన సమాధానాన్ని చెబుతున్నారు.
అల్లు అర్జున్ సినిమాల ఎంపిక విషయంలో నే కాకుండా ఆయన స్టైలింగ్ విషయాలలో అలాగే డ్రెస్సింగ్ , లుక్ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఆయనను బెస్ట్ వన్ గా ప్రజెంట్ చేయడానికి కృషి చేస్తుంది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యక్టివ్ గా ఉంటూ తమ పర్సనల్ విషయాలు తెలియజేస్తూ ఉంటుంది. వీరిద్దరి దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా వారు కూడా ఇప్పుడు సినిమాలలోకి రావడానికి అంత ఉత్సాహం చూపించడం విశేషం. మరి భవిష్యత్తులో ఈ జంట ప్రేక్షకులను ఎంతగా ఇన్ ఫ్లుయెన్స్ చేస్తారో చూడాలి.