సినిమా పరిశ్రమకు వచ్చి 10 సంవత్సరాలు దాటుతున్నా కూడా అవకాశాలను ఏమాత్రం తగ్గించుకోకుండా సూపర్ హిట్ సినిమాలను పెద్ద హీరోలతో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకు పోతుంది మిల్కీబ్యూటీ తమన్నా. గతంతో పోలిస్తే కొంత అవకాశాలు కొంత తక్కువే అయినా కూడా ఆమెకు సినిమాల పరంగా ఎలాంటి లోటు లేదు. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ మరొకవైపు వెబ్ సిరీస్ లు ఇంకొకవైపు పెద్ద హీరోల సినిమాలు ఇలా అన్ని కలగలిపి సినిమాలు చే స్తూ తన కెరియర్ ను బిజీగా ఎంతో ముందుకు తీసుకు వెళుతుంది.

ప్రస్తుతం ఆమె చేతిలో మంచి ప్రాజెక్టులే ఉన్నాయని చెప్పవచ్చు. వాటిలో ఒకటి వెంకటేష్ తో కలిసి నటిస్తున్న f3 సినిమా.  భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా లో ఆమె పాత్ర వెరైటీ గా ఉండబోతుంది. ఆ విధంగా తమన్నా మూడు సినిమాలు ఆరు వెబ్ సిరీస్ లు అంటూ తన కెరియర్ ను ఎంతో బిజీ గా ముందుకు తీసుకు వెళుతుంది.  దానికి తోడు ఆమె కొన్ని బాలీవుడ్ సినిమాలలో కూడా నటించడం ఆమెకు ఆమె కెరియర్ కు ఎంతగానో ప్లస్ అవుతుంది. తాజాగా తమన్నా కు మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం కూడా లభించినట్లు తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన కొన్ని సినిమాలు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. అలా బాబీ దర్శకత్వం లో ఆమె చేయబోయే సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది అని వార్తలు వస్తున్నాయి.  కొత్త హీరోయిన్ ల తాకిడి పాతబడిపోయిన హీరోయిన్ అన్న వార్తలు వచ్చినా ఎలాంటి విమర్శలు వచ్చినా కూడా తనకే సొంతమైన అభినయంతో నటనతో అలరిస్తూ సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది తమన్నా. మరి ఈ చిత్రం తర్వాత ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ పెరుగుతుంది ఎలా అవకాశాలు పెరుగుతాయి చూడాలి. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: