
బిగ్ బాస్ స్టేజీపైన నాగార్జున మాట్లాడుతూ. టూ నైట్ యూ ఆర్ ది స్టార్స్.. కానీ మీరు చాలా మంది స్టార్స్ ని చూడబోతున్నారు.. అంటూ నాగార్జున తెలుపుతారు. బిగ్ బాస్ విజేతను ప్రకటించే సమయంలో ఈ షోలో ఇంతకుముందు కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఇక అందాల తార శ్రీయ కూడా తనదైన శైలిలో స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైన అలరించారు. ఇక సాయి పల్లవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లను చూసి ఒక్కసారిగా మెస్మరైజ్ అయిపోయింది.
ఇక ఈ స్టేజ్ పైన ఆలియాభట్ బాలయ్య డైలాగ్ దబిడి దిబిడే అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆనందం వ్యక్తం చేశారు.. ఇక రష్మిక కూడా సామి సామి పాటకు స్టెప్పులు ఇరగదీసింది. ఇక సింగర్ కన్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ కూడా నాటు నాటు పాట పాడుతూ స్టెప్పులు వేశాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి నటరాజ్ మాస్టర్ , అనీ మాస్టర్ కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నాటు నాటు పాటకు స్టెప్పులు వేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.