మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కావలసి ఉండగా కరోనా కారణం గా ఈ చిత్రాన్ని మరొకసారి వాయిదా వేయక తప్పలేదు సినిమా బృందం. సంక్రాంతి తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాలని భావించారు. అయితే పరిస్థితులు అనుకూలం గా లేకపోవడంతో ఈ సినిమాను మరొకసారి పోస్ట్ ఫోన్ చేయక తప్పలేదు.

నిన్న సంక్రాంతి సందర్భంగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చింది యూనిట్. కానీ ఎప్పుడు విడుదల చేస్తామన్న విషయం మాత్రం నిన్న వెల్లడించలేదు. ఈరోజు ఈ సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు ఈ సినిమా ఎక్కువ రోజులు పోస్ట్పోన్ కాకపోవడంపై కొంత సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడీగా పూజాహెగ్డే చేస్తుంది.

వాస్తవానికి ఈ సినిమా పోయిన ఏడాది వేసవిలో మే నెలలో విడుదల కావాల్సి ఉంది కానీ ప్రతిసారి కూడా కరోనా మహమ్మారి అడ్డు రావడంతో ఈ సినిమా ఇంతవరకు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. సైరా సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేసిన చిత్రబృందం కు ప్రతిసారి అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే ఈ సినిమా ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయడానికి కారణం లేకపోలేదట. అప్పటివరకు కరోనా ఏ విధంగానూ సమాజంపై ప్రభావం చూపే అవకాశం ఉండదు. లాక్ డౌన్ కూడా అప్పటివరకు ఎత్తివేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్లో సినిమాను విడుదల చేయడం మంచిదని భావించి ఈ విధమైన నిర్ణయం తీసుకుందట యూనిట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: