ఐటెమ్‌ సాంగ్‌ అంటే ఏముంటాయి.. హీరోయిన్‌ అందాలు, కుదిరితే పొట్టి గౌన్‌లు అలాగే ఇంకొచెం మత్త్చెక్కించే స్కిన్‌ షోలు. ఇది ఒక రకం అయితే. ఇక్కడ ఇంకో రకం కూడా ఐటెమ్‌ సాంగ్స్‌ కూడా ఉన్నాయి.అందులో చిన్నపాటి బూతులు, అర్థం కాని బీట్‌లు ఇంకా శబ్దాలు ఉంటాయి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో ఈ ఐటెమ్ సాంగ్స్‌ అంటే ఇలానే ఉంటున్నాయి. అవే వినిపిస్తున్నాయి ఇంకా కనిపిస్తున్నాయి. కానీ ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్‌ ఒక ఐటెమ్‌ సాంగ్‌ని మోటివేషనల్‌ సాంగ్‌గా మార్చేశారు. ఏంటి సందేహమా? అయితే 'గని' సినిమా నుండి కొత్తగా వచ్చిన 'కొడితే' పాటను ఖచ్చితంగా విని చూడండి.ఇక ఈ పాటలో తమన్నా ఎర్రని హాట్‌ హాట్‌ అందాలు అదిరిపోయాయి. ఇక తమన్‌ సంగీతం అయితే నెక్స్ట్ లెవల్‌ అని చెప్పాలి. పక్కా మాస్‌ మసాలా ఐటెమ్‌ సాంగ్‌లా ఉంటుంది ఈ పాట.ఇక మరోసారి గమనించి వినండి. ఈసారి అందులోని లిరిక్‌ను చాలా ప్రత్యేకంగా విని చూడండి. అప్పుడు మీకే తేడా తెలుస్తుంది.

ఇంకా ఈ పాట పక్కా మోటివేషనల్‌ సాంగ్‌ అని స్పష్టంగా మీకే అర్థమవుతుంది. రామజోగయ్య శాస్త్రి కలం నుండి ఇటీవల జాలువారిన పాటల్లో ఇది కచ్చితంగా ఒక మంచి గొప్ప పాట అనే చెప్పొచ్చు. ఐటెమ్‌ సాంగ్‌లో అలాంటి పదాలు చొప్పించి రాయడం గొప్ప విషయం అని చెప్పాలి.అన్ని ఐటెమ్‌ సాంగ్స్‌ లాగే ఈ పాట కూడా ఉంటుంది అని అనుకుంటే పొరపాటని చెప్పాలి.ఈ పాట 'లా లారే లాలే.' అంటూ పక్కా బీట్‌ సాంగ్‌లా మొదలు అవుతుంది. కానీ అసలైన లిరిక్స్‌ వచ్చేసరికి మొత్తం కూడా దెబ్బకు మారిపోతుంది. బాక్సింగ్‌ నేపథ్య సాంగ్‌ కాబట్టి రామజోగయ్య శాస్త్రి రింగ్‌తోనే ఈ పాటను మొదులపెట్టారు. ఆయన ఈ పాటలో బాక్సింగ్‌ రింగ్‌ని డెస్టినీ రింగ్‌తో పోల్చారు. బాక్సింగ్‌ అతనికి స్ఫూర్తి అని కూడా ఆయన చాలా చక్కగా చెప్పారు. ఇలా ఈ పాటతో యూత్ ని బాగా మోటివేట్ చేసి మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: