నితిన్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేస్తున్న నితిన్ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నాడనే చెప్పాలి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా  శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. అయితే దీనికంటే ముందు నితిన్ నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెపించకపోవడం తో ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని నితిన్ అభిమానులు భావిస్తున్నారు. 

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేసిన చెక్ సినిమా భారీ స్థాయిలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ఫ్లాప్ గా నిలిచిపోయింది. ఆ తర్వాత రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన రంగ్ దే సినిమా కూడా భారీ ఫ్లాప్ ఎదుర్కోవడంతో ఒక్కసారిగా నితిన్ తన కెరీర్ విషయం లో అనుమానం లో పడ్డాడు. ఈసారి జోనర్ మార్చి పొలిటికల్ నేపథ్యంలో సినిమా చేస్తుండడం విశేషం. అంతే కాదు ప్రముఖ రచయిత దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో కూడా ఆయన ఓ సినిమా చేసే విధంగా రంగం సిద్ధం చేశాడు.

తొందరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఉంది. నా పేరు సూర్య సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వక్కంతం వంశీ తన రెండో సినిమాను మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు నితిన్ తో చేసే ఈ సినిమాతో ఆయన హిట్ అందుకుంటాదో చూడాలి. అయితే నితిన్ హీరోగా పవర్ పేట అనే సినిమా తెరకెక్కవలసి ఉంది. ఈ చిత్రానికి దర్శకుడుగా గీత రచయిత చైతన్య కృష్ణ అయితే ఈ సినిమా మధ్యలో ఆగిపోవడానికి కారణం ఈ సినిమా బడ్జెట్ భారీ స్థాయిలో పెరిగిపోవడమే అని తెలుస్తోంది. లేకపోతే ఈ సినిమా రంగ్ దే సినిమా తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. మరి భవిష్యత్తులోనైనా ఈ సినిమా ఉందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: