నందమూరి నటసింహం బాలకృష్ణ కొంతకాలం నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర వరస పరాజయాలతో డీలా పడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే, అయితే అలాంటి సందర్భంలోనే నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.  ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా పూర్ణ ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్ లను సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించింది, ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  బాలకృష్ణ,  గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ 16 ఫిబ్రవరి 2022 న తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల అధికారికంగా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది, ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతుంది, ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్  కనిపించబోతుంది,  అలాగే ప్రతినాయకుడి పాత్రలో దునియా విజయ్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాను 2022 దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది, ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని ఫ్యామిలీ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఈ మూవీ నందమూరి నటసింహం బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: