ప్రతి విషయము మనకు తెలుసు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు.. కొంత మంది ఇచ్చే సలహా మేరకు కొన్ని మాటలు వింటే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని తెలిపింది. ఇక ఈ తరుణంలోనే ఒక స్టార్ హీరో తనకి ఒక అద్భుతమైన మాట చెప్పారని ఆమె తెలియజేసింది. ఇక ఈ మాటలను తన జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని దీపికా పదుకొనే తెలియజేసింది. దీపిక తెలియజేస్తూ.. మనం ఏదైనా ఒక సినిమాకు సంతకం చేస్తున్నామంటే ఆ సినిమాని మనం ఒక ఉద్యోగం లా కాకుండా .. ఆ సెట్లోనే ఒక వ్యక్తి లాగా ఉండి చేయాలని అని తనకి షారుక్ ఖాన్ చెప్పినట్లుగా తెలియజేసింది.
అందుచేతనే ఆయన మాటలను ఎప్పటికీ గుర్తు పెట్టుకొని ఉంటానని తెలిపింది. ఇక తనకు ఇచ్చిన వరెస్ట్ సలహా ఏమిటంటే.. బ్రెస్ట్ ఇంప్లిమెంటేషన్ చేయించుకుంటే.. తనకు సినీ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు వస్తాయని ఒక చెత్త సలహా ఒకరు ఇచ్చారని తెలియజేసింది.. అయితే ఆ విషయంలో వారి మాట వినకపోవడం తనకు చాలా మంచి జరిగింది అని దీపిక ఈ సందర్భంగా తెలియజేసింది. దీపికా పదుకొనే l మాటలను విన్న ఆమె అభిమానులు కాస్తా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందుచేతనే తన మీద వచ్చిన ఏవైనా కామెంట్లకు ఆమె పెద్దగా పట్టించుకోలేదని అభిమానులు తెలియజేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి