దాంతో ఈ చిత్రం పై పెద్దగా బజ్ అయితే లేదు. కానీ టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే కొంత ప్రామిసింగ్ గా అయితే అనిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ లుక్స్ కూడా కాస్త డిఫరెంట్ అదే విధంగా ట్రెండీగా కూడా అనిపిస్తున్నాయి.స్టాండప్ కమెడియన్ గా అతను ఈ చిత్రంలో కనిపిస్తున్నాడట.వర్ష బొల్లమ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.. ఈమె ఉందంటే సినిమా మినిమమ్ గ్యారెంటీ అంటుంటారు కొంతమంది ఇండస్ట్రీ వర్గాలు..
ఈ చిత్రానికి వచ్చేసరికి పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ గట్టెక్కితే ఈ చిత్రంతోనే గట్టెక్కాలి అంటూ ఇన్సైడ్ టాక్ కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా… ఈ చిత్రం దర్శకుడు శాంటో మోహన్ వీరంకి దర్శకుడు రాజ్ తరుణ్ ను ఆడిషన్ కూడా చేసాడట. ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ అయిన రాజ్ తరుణ్ ను ఆడిషన్ చేయడం ఏంటి అనే డౌట్ అందరికీ కూడా రావచ్చు. ఈ విషయం పై రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. 'దర్శకుడు శాంటో నాకు 4 గంటల పాటు ఈ కథ చెప్పాడని చాలా డిటైల్‌డ్ గా వివరించాడని చెప్పుకొచ్చాడు.
వెంటనే మరునిముషంలో చేస్తానని చెప్పానని కానీ నాపై ఆయనకు నమ్మకం కలగలేదు. నేను చేస్తానన్నానుగదా! అని అంటే, కాదు. ఆడిషన్ కావాలి అన్నాడు అని చెప్పాడు.. అలా ఆడిషన్ చేశాక ఆయనకి నాపై నమ్మకం ఏర్పడింది. ఇది మా రెండేళ్ళ ప్రయాణం.. స్టాండప్ రాహుల్ అంటే ఆకట్టుకునే కామెడీతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు.పూజాహెగ్డే ఇటీవల ఓ సినిమాలో చేసిందని అది మాకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. దానికి మించిన కామెడీ మా సినిమాలో అయితే ఉంటుంది.ఎమోషన్స్ కూడా అంతే సమపాళ్లలో ఉంటాయి. ఈ సినిమా నా కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుందని చెప్పాడు.
వర్ష పాత్ర కూడా చాలా క్యూట్ గా వుంటుంది. ఆమెకు కొన్ని అభిప్రాయాలు కూడా ఉంటాయి. వాటిని బాలన్స్ చేస్తూ నా కుటుంబాన్ని కూడా చూసుకుంటూ స్టాండప్ కామెడీ ఎలా చేశాననేది ఇందులో దర్శకుడు బాగా తెరకెక్కించారు . ఇటువంటి సినిమా ఇంతకుముందు అయితే రాలేదు. చిత్ర నిర్మాతలు కరోనా వచ్చి మధ్యలో ఆగిపోయినా చాలా నమ్మకంతో ఈ సినిమాకు ఎంతమేరకు కావాలో అన్ని సౌకర్యాలు కూడా కల్పించారు. దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్మకముంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి