టాలీవుడ్ స్టార్
హీరోయిన్ రష్మిక ఏదైతే జరగవద్దు అనుకుందో అదే జరిగింది. ఏ
హీరోయిన్ అయినా ఏ
హీరో అయినా ఫ్లాప్ వస్తే వారిలో వణుకు పుడుతుంది. వారందరికీ తుఫాన్ కంటే సునామి కంటే కూడా ఫ్లాప్ అనేది ఎంతో భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకూ ఫ్లాప్ బారిన పడకుండా ఉంటేనే బాగుంటుంది అనేది వారి ఆలోచన. కానీ ఫ్లాప్ అనేది ఎవరినీ వదిలిపెట్టదు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా వారి సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి.
హీరోల కంటే కూడా
హీరోయిన్ లపై దీని యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది కాబట్టి వారు సినిమాలు చేసే విషయంలో ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉంటారు. ఒకవేళ ఫ్లాప్ వచ్చినా వీలైనంత త్వరగా దాని నుంచి బయటపడడానికి వారు ట్రై చేస్తూ ఉంటారు. ఆ విధంగా
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వరుస
సక్సెస్ లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది రష్మిక. సరిలేరు నీకెవ్వరు పుష్ప వంటి సినిమాలతో ఆమె దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా యువతలో కూడా ఆమెకు గతంలో కంటే ఎక్కువగా పాపులారిటీ పెరిగిపోయింది.
పుష్ప సంచలన విజయం నమోదు చేయడంతో ఆమెకు ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులారిటీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో
రష్మిక దానికంటే ముందే ఒప్పుకున్న ఓ
సినిమా ఇటీవల విడుదలై ఆమెకు ఫ్లాప్ ను తీసుకు వచ్చింది. ఆమె విజయ పరంపర కు ఈ
సినిమా బ్రేకులు వేసింది. శర్వానంద్ హీరోగా నటించిన ఆడాళ్ళు మీకు జోహార్లు
సినిమా ఇటీవలే విడుదలై భారీ హిట్ అందుకోవడంలో విఫలం కావడంతో తన అంచనా ను అందుకోక పోవడంతో పూర్తిగా నిరాశ పడిందట. ఈ నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతూ తన సినిమాల విషయంలో అలాంటి పొరపాటు జరగకూడదని భావిస్తుంది. ప్రస్తుతం పుష్ప రెండవ భాగంలో
హీరోయిన్ గా నటిస్తున్న ఈమె బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలను ఒప్పుకుంది. కోలీవుడ్లో సైతం ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి.