‘ఆర్ ఆర్ ఆర్’ సందడి ముగిసిపోవడంతో ఇక ఫిలిం ఇండస్ట్రీ అంతా ఏప్రియల్ లో విడుదలకాబోతున్న భారీ సినిమాల పై పడింది. ఏప్రియల్ రెండవ వారంలో విడుదల కాబోతున్న ‘కేజీ ఎఫ్ 2’ ‘బీస్ట్’ సినిమాలు పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ అవి డబ్బింగ్ సినిమాలు కావడంతో తెలుగు రాష్ట్రాలలో వాటి పై చెప్పుకోతగ్గ క్రేజ్ లేదు.



దీనితో వచ్చేనెల చివరి వారంలో విడుదల కాబోతున్న ‘ఆచార్య’ పైనే అందరి దృష్టి ఉంది. భారీ అంచనాలతో విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ ఆమూవీ బయ్యర్లకు కలెక్షన్స్ విషయంలో పూర్తి సంతృప్తిని ఇచ్చే అవకాశం లేదు అన్నఅంచనాలు వస్తున్నాయి. అయితే ఈమూవీ వల్ల రాజమౌళి ఇమేజ్ ఎంత పెరిగిందో అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఆ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ మాత్రం విపరీతమైన క్రేజ్ పెరిగింది.




ఈసినిమాను చూసిన సగటు ప్రేక్షకుడు నటన విషయంలో చరణ్ కు మంచి మార్కులు వేయడంతో ఈమూవీ తరువాత కేవలం నెలరోజుల గ్యాప్ లో విడుదల కాబోతున్న ‘ఆచార్య’ తో చరణ్ కు మరింత ఇమేజ్ పెరిగే ఆస్కారం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి. ఈ మూవీ యూనిట్ వర్గాల నుండి అందుతున్న లీకుల ప్రకారం ఈమూవీలో చరణ్ చిరంజీవితో కలిసి స్క్రీన్ పై 25 నిముషాలు కనిపిస్తాడు అని అంటున్నారు.



దీనికితోడు ఈమూవీలో చరణ్ జూనియర్ లపై చిత్రీకరించిన పాట ఆమూవీకి హైలెట్ అవుతుందని ఆ పాట ట్యూనింగ్ కూడ బాగా వచ్చిందని అంటున్నారు. వచ్చేనెల నుండి ప్రారంభం కాబోతున్న ఈమూవీ ప్రమోషన్ లో ఈపాట విడుదల అయిన తరువాత ఆ పాట ట్రెండింగ్ గా మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దర్శకుడు కొరటాల ఈమూవీలో చరణ్ పాత్రను చిరంజీవి పాత్రతో సరి సమానంగా తీర్చి దిద్దడంతో చరణ్ నటనకు పరాకాష్టగా ‘ఆచార్య’ కూడ సహకరిస్తే చరణ్ మ్యానియా మరింత పెరిగే ఆస్కారం ఉంది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: