కోలీవుడ్లో స్టార్ హీరో సూర్య గురించి, తెలుగు ఇండస్ట్రీలో కూడా పరిచయం చేయనవసరం లేదు. వైవిధ్యమైన కథలతో తన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పిస్తూ ఉంటాడు సూర్య. ఇక రియల్ హీరో గానే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు. అగారం ఫౌండేషన్ను స్థాపించి సూర్య గత 10 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇక అంతే కాకుండా ఎంతో మంది పిల్లలకు ఉచితంగా చదువులు అందించడమే కాకుండా ఎందరో పేదలను కూడా ఆదుకుంటూ ఉన్నారు సూర్య. ఇక కరోనా సమయంలో కూడా సూర్య తన విశాల హృదయంతో ఎంతో మందికి సహాయం చేశారు.


అయితే ఇప్పుడు తాజాగా మరొక సారి తన గొప్ప మనసుతో ఒక మంచి పని చేశారు. ఇక ఇటీవల కాలంలో ET చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య. ఆ తర్వాత డైరెక్టర్ బాల డైరెక్షన్ లో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సూర్య ఒక చాపలు పట్టే జాలరి గా కనిపించ బోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం కన్యాకుమారి పరిసరాలలోని జరగబోతుందట. అయితే ఈ సినిమా కోసం సముద్ర తీరంలో భారీ ఖర్చులతో కొన్ని సెట్స్ కూడా నిర్మిస్తున్నారు.

ఇందులో భాగంగా అక్కడ ఉండి మృత్యు కారులకు నివసించేందుకు ఇల్లు గుడిసెలను కూడా నిర్మిస్తున్నట్లు గా తెలుస్తోంది. అయితే వీటిని సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత వాటిని పడేయకుండా ఇల్లు  లేని జాలర్లకు ఉచితంగా ఇవ్వాలని సూర్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇక సూర్య తన 41వ చిత్రంలో మృత్యు కారుడు పాత్రలో నటిస్తున్నారు. అందుకోసం సూర్య వారి జీవితాలను చాలా దగ్గరి నుంచి చూడడంతో వారి బాధలను చూసి ఇల్లు లేనివారికి ఇలా సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సూర్య ఈ పని చేయడంతో ఆయన అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా సూర్యాన్ని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: