యంగ్ టైగర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోగా నటించాడు.  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా సంవత్సరాల నటించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు.  మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి కావడంతో ఎన్టీఆర్ తదుపరి  సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.  

ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్'  సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే.  ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్, ఉప్పెన మూవీ తో దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు కూడా ఒకరోజు రాబోతున్నట్లు తెలుస్తుంది.

అసలు విషయంలోకి వెళితే... మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ టైటిల్ మరియు, నటినటులు ఇతర వివరాలను ఈ చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అలాగే ఎన్టీఆర్,  ప్రశాంత్ నెల్ కాంబినేషన్ లో  తెరకెక్కబోయే సినిమా ఫ్రీ లుక్ ని ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.  అలాగే ఎన్టీఆర్ , బుచ్చిబాబు సన కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ అనౌన్స్మెంట్ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జరగనున్నట్లు తెలుస్తోంది.  ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒకే రోజు మూడు అప్డేట్ లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.  ఎన్టీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా తన ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: