తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.ఇకపోతే ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గినా ఓటీటీలో మాత్రం ఈ సినిమా అంచనాలకు మించి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. అయితే ఆర్ఆర్ఆర్ సౌత్ భాషల డిజిటల్ హక్కులను జీ5 కొనుగోలు చేయగా ఈ ఓటీటీలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ అవుతోంది.కాగా జీ5 ఓటీటీలో ఈ సినిమా సంచలన రికార్డ్ ను సొంతం చేసుకుంది.

 ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నంబర్1 స్థానంలో ట్రెండ్ అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పటివరకు సౌత్ లోని అన్ని భాషల్లో 1000 మిలియన్ మినిట్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే ఓటీటీలో కూడా ఆర్ఆర్ఆర్ సంచలన రికార్డులను సొంతం చేసుకోవడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు జీ5లో ఈ మధ్య కాలంలో ఏ సినిమా సొంతం చేసుకోని స్థాయిలో ఈ సినిమా రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.ఇక జీ5లో ఈ సినిమా మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అంతేకాదు ఓటీటీలో ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలోని తప్పులను కనిపెట్టి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ అన్నిచోట్ల ప్రభంజనం సృష్టిస్తుండటం గమనార్హం. కాగా ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో చరణ్, ఎన్టీఆర్ లకు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది.అయితే ఆర్ఆర్ఆర్ ద్వారా దక్కిన క్రేజ్ ను సరైన విధంగా వినియోగించుకోవాలని చరణ్, ఎన్టీఆర్ భావిస్తున్నారు. ఇకపోతే ఈ హీరోల తర్వాత ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్స్ ను అందుకుంటాయో ఏ స్థాయిలో సంచలనాలు స్థాయిలో సృష్టిస్తాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: