రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం కూడా వరుస పెట్టి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో, అంతకుమించి మూవీ లలో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం సలార్,  ఆది పురుష్,  ప్రాజెక్ట్ కే వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు. 

ఇలా మూడు మూవీలు సెట్స్ పై ఉండగానే ప్రభాస్ , అర్జున్ రెడ్డి మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకొని, అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ లో కూడా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వున్న దర్శకులలో ఒకరు అయిన  మారుతి దర్శకత్వంలో ప్రభాస్ 'రాజా డీలక్స్' అనే హర్రర్ కామెడీ సినిమాలో నటించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా మారుతి , ప్రభాస్ సినిమా గురించి తెలియజేస్తూ... ప్రభాస్ ను డార్లింగ్,  బుజ్జిగాడు మూవీ లలో ఉన్నట్లు చూపించాలని ఉంది అని తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్,  మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభం అయిన తరువాత ఫుల్ స్పీడ్ లో ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: