సూపర్ స్టార్ మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది . ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందించనున్నాడు .

\ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు . కాక పోతే మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ఇప్పటికే రెండు మూవీ లను లైన్ లో పెట్టి ఫుల్ బిజీ లైన్ అప్ ను సెట్ చేసుకున్న  మహేష్ బాబు తో మరో ఇద్దరు దర్శకులు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది . ఆ ఇద్దరు దర్శకులు మరెవరో కాదు . పుష్ప మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న సుకుమార్,  అర్జున్ రెడ్డి మూవీ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగ.  ఈ ఇద్దరు దర్శకులు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఉంటే ఇది వరకు సుకుమార్ , మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 1 నేనొక్కడినే  మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకో పోయినప్పటికీ,  ఈ సినిమా స్క్రీన్ ప్లే కు మాత్రం సుకుమార్ కు మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: