సీనియర్ యాంకర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు పొందింది యాంకర్ సుమ. ఈమధ్య నటిగా కూడా కొన్ని సినిమాలలో నటిస్తోంది ముఖ్యంగా బుల్లితెరపై సుమ కి విపరీతమైన ఆదరణ ఉందని చెప్పవచ్చు. సినిమా ఈవెంట్ల స్టేజీలు పైన సుమ కనిపిస్తూ ఉంటుంది దాదాపు అగ్ర హీరోల సినిమా ఈవెంట్ల వేదికకు సుమనే హోస్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆ స్థాయికి రావడం వేనుక సుమ ఎంతో కష్టపడి ఉందని చెప్పవచ్చు వృత్తిపై తనకున్న నిబద్ధత చేసే పనిపై ఇష్టం ఇలా ఎన్నో అంశాలు సుమ పైన తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.


అలా ఒక ఇంటర్వ్యూలో సుమకి ఎదురైన ఒక ఘటన గురించి తెలుపుతూ చాలా కన్నీరు పెట్టుకుంది. ఆ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాంకర్ సుమ కొన్ని సంవత్సరాల క్రితం తన కుమార్తెకు చిన్నవయసులో ఒకరోజు 102 డిగ్రీల తీవ్రమైన జ్వరం వచ్చిందట. తనతో పాటి ఉంటానని పట్టుబడిన తన కుమార్తె. దీంతో తప్పక స్టార్ మహిళ షూటింగ్ కు తీసుకు వెళ్ళవలసి వచ్చిందట. దీంతో అక్కడే ఒక రూమ్ లో కుమార్తెను పడుకోబెట్టి సుమ షో లో చాలా బిజీగా అయిపోయింది మధ్యలో గ్యాప్ దొరికినప్పుడల్లా వెళ్లి తన కుమార్తె ను చూసి వచ్చేది అదేరోజు ఇంకా కొన్ని ప్రోగ్రాములు కూడా అదనంగా ఉండడంతో వాటికి కూడా హోస్టు గా చేయవలసి వచ్చింది.

ఇక అదే రోజున ఒక స్టార్ హీరో రిలీజ్ ఈవెంట్ కూడా శిల్పకళా వేదికలో ఉన్నదట. అయితే ఇక్కడైతే టీవీ షో షూటింగ్ సమయాలలో పడుకోబెట్టడానికి రూమ్స్ ఉంటాయి కానీ శిల్పకళా వేదికలో కేవలం మేకప్ రూములు తప్ప ఎక్కడా కూడా మంచాలు ఉండవని తెలియజేసింది.దీంతో తన కుమార్తెను రూములో చిన్న సెల్ఫ్ పై పడుకోబెట్టి అక్కడ తోడుగా ఒక మనిషిని పెట్టి స్టేజి మీదకి వచ్చానని తెలిపింది ఆ క్షణం స్టేజి పైకి రాగానే వెంటనే తన కుమార్తెని మర్చిపోయి ప్రోగ్రాం లో చాలా బిజీ అయిపోయానని తెలిపింది. అలా తన మనసుని రాయి చేసుకుని ఆ రోజంతా చాలా పని చేయవలసి వచ్చిందని తెలిపింది సుమ.

మరింత సమాచారం తెలుసుకోండి: