పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు చెప్పనవసరం లేదు . అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న సమయం లోనే పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత కొంత కాలం పాటు సినిమా లకు దూరంగా ఉండి కేవలం రాజకీయాల వైపు మాత్రమే దృష్టి పెట్టాడు . కాక పోతే ఆ తర్వాత అభిమానుల కోరిక మేరకు సినిమాల్లో నటిస్తూనే , రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ వస్తున్నాడు .

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది . అప్పట్లో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' మూవీ కోసం రోజుల చొప్పున రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నాదు అని ఒక వార్త వైరల్ అయ్యింది . ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తాజాగా వినోదయ సీతం అనే తమిళ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన మూవీ లో నటించబోతున్న విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ కి పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే కేటాయించనున్నట్లు తెలుస్తోంది .

అయితే పవన్ కళ్యాణ్ రోజుకు రెండున్నర కోట్ల చొప్పున ఈ రీమేక్ మూవీ కోసం రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . ఇది ఇలా ఉంటే వినోదయ సీతం తమిళ్ రీమేక్ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నారు . వినోదయ సీతం ఒరిజినల్ తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన సముద్ర ఖని తెలుగు రీమేక్ మూవీ కి కూడా దర్శకత్వం వహించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: