టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు . 

ఈ సినిమాను దర్శకుడు పూరి జగన్నాథ్ బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మైక్ టైసన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా పుట్టినరోజు జరుపుకున్న మైక్ టైసన్ కు ఈ చిత్ర బృందం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే లైగర్ సినిమాను ఆగస్ట్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడినప్పటికీ ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను తప్ప పెద్దగా ఎలాంటి అప్డేట్ లను విడుదల చేయలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్ లో 'కమింగ్' అంటూ ఒక పోస్టు ను పెట్టాడు. ఇది లైగర్ సినిమా ప్రమోషన్ ల కోసమే అని చాలా మంది అనుకుంటున్నారు. మరి విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా ప్రమోషన్ ను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాడా...  లేక వేరే ఏమైనా ఉద్దేశం ఉందా అనేది తెలియాలి. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ,  పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో జనగణమన సినిమా కూడా ప్రారంభం కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: