ఇక తాజాగా మాధవన్ నటించిన రాకెట్రి ది నంబి ఎఫెక్ట్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది. ఈ సినిమాని డైరెక్టర్ గా మాధవన్ తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 25 కోట్ల రూపాయలతో తేరకెక్కించగా రూ. 45 కోట్ల రూపాయల వరకు లాభం వచ్చినట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాలను వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మాధవన్ మరొకసారి ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా పెరకెక్కించిన ఈ చిత్రం జూలై ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందు రావడం జరిగింది.
ఇప్పుడు ఈనెల 26వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకేసారి తెలుగు తమిళ హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్నట్లు తాజాగా ఒక పోస్టర్ ద్వారా విడుదల చేశారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఇక మరొకరు తమిళ హీరో సూర్య కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి మెప్పించారు. ఇక ఈ సినిమాలో మాధవన్ నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. మాధవన్ డైరెక్టర్ చేసిన విధానం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి