నాగచైతన్య కెరియర్ కు మంచి బ్రేక్ ఇస్తుంది అని భావించిన ‘థాంక్యూ’ మూవీ ఫెయిల్ అవ్వడం ఒకవిధంగా చైతూ మార్కెట్ కు పరోక్షంగా దెబ్బ తీస్తుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ కామెంట్స్ మధ్య నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ ఈవారంలో విడుదల కాబోతోంది. బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ పక్కన నటించడం ఒక అదృష్టం అయితే ఏకంగా అమీర్ ఖాన్ ఈమూవీ ప్రమోషన్ కోసం అనేకసార్లు హైదరాబాద్ వచ్చి చైతన్యను పక్కన పెట్టుకుని ఈమూవీని ప్రమోట్ చేస్తున్నాడు.


ఇదిచాలదు అన్నట్లుగా మెగా స్టార్ చిరంజీవి ఈమూవీని తెలుగు రాష్ట్రాలలో ప్రమోట్ చేయడమే కాకుండా ఈమూవీకి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక నాగార్జున అయితే తన సినిమాల విషయం పక్కకుపెట్టి ఈమూవీ ప్రమోషన్ లో చాల యాక్టివ్ గా ఉన్నాడు. ఇప్పటికే అనేకమంది టాలీవుడ్ ప్రముఖుల కోసం ఈమూవీ ప్రీమియర్ షోను అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రదర్శించినప్పుడు వారంతా ఈమూవీని చూసి అమీర్ ఖాన్ ను అదేవిధంగా చైతన్యను ఆకాశంలోకి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


దీనితో ఈమూవీ పై చైతూ చాల ఆశలు పెట్టుకున్నాడు. ఒకవైపు నాగచైతన్య మాజీ భార్య సమంత బాలీవుడ్ లో దూసుకుపోతున్న పరిస్థితులలో చైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ రిజల్ట్ గురించి చాలామంది ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆగష్టు నెల చైతన్య కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. తన కొడుకు మూవీ విడుదలైన మూడు వారాలకే నాగార్జున కీలక పాత్రలో నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ మొదటివారంలో విడుదల కాబోతోంది.


‘బాహుబలి’ రికార్డులను తిరగ వ్రాస్తుంది అన్న ప్రచారం ఈమూవీ పై ఉంది. గతంలో నాగార్జున బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆసినిమాల వల్ల నాగార్జునకు బాలీవుడ్ లో ప్రత్యేకంగా కలిసి వచ్చింది లేదు. అయితే ‘బ్రహ్మాస్త్ర’ మూవీలో నాగ్ నటించిన నెగిటివ్ రోల్ ఆసినిమా మలుపుకు కారణం అవుతుంది అంటున్నారు. దీనితో చైతన్య నాగార్జునలకు ఈ రెండు నెలలు అత్యంత కీలకం అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: