టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సుధీర్ బాబు ఆఖరు గా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'వి' మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ఈ మూవీ లో సుధీర్ బాబు తో పాటు నాచురల్ స్టార్ నాని కూడా హీరోగా నటించాడు . ఈ మూవీ లో అదితి రావు హైదరి మరియు నివేదా థామస్ హీరోయిన్ లుగా నటించారు . ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరు గా అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ బాబు ,  ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీరు చెప్పాలి అనే మూవీ లో హీరోగా నటించాడు. 

మూవీ లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి , సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 16 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ మూవీ నుండి సాంగ్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ మూవీ నుండి 'మీరా హీరోలా' అనే సాంగ్ ను ఆగస్ట్ 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి సాగర్ సంగీతాన్ని అందించడు.

మరింత సమాచారం తెలుసుకోండి: