బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సన్నీ ఆ పాపులారిటీతో వరుస సినిమా ఛాన్సులు అందుకుంటున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ అనే సినిమా చేస్తున్న వీజే సన్నీ తన నెక్స్ట్ వెబ్ సీరీస్ ఏ.టి.ఎం తో వస్తున్నాడు. ఈ వెబ్ సీరీస్ కి హరీష్ శంకర్ కథ అందించడం జరిగింది. అంతేకాదు ఈ వెబ్ సీరీస్ నిర్మాణంలో కూడా ఆయన భాగస్వామ్యం అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా సన్నీ బర్త్ డే సందర్భంగా ATM నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

సన్నీ మచ్చ ఊర మాస్ లుక్ తో అదరగొట్టాడు. ఈ వెబ్ సీరీస్ తో సన్నీ ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తాడని చెప్పొచ్చు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ని సరైన మార్గంలో యూజ్ చేసుకుంటున్నాడు సన్నీ. ఆల్రెడీ అతను నటించిన సకళ గుణాధిరామ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య షో టైటిల్ తో ఆ సినిమాపై కూడా మంచి ఏర్పరచుకున్నాడు సన్నీ.

సన్నీ నటిస్తున్న ATM వెబ్ సీరీస్ ని చంద్ర మోహన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ జీ తెలుగులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సన్నీ చేస్తున్న మొదటి క్రేజీ వెబ్ సీరీస్ అవడంతో అతని ఫ్యాన్స్ ఈ వెబ్ సీరీస్ పై అంచనాలు పెంచుకున్నారు. హీరోగా సన్నీ క్లిక్ అయితే మాత్రం బిగ్ బాస్ వల్ల సక్సెస్ అయిన లిస్ట్ మొదటి స్థానంలో ఉన్నాడు సన్నీ. ఎందుకంటే అంతకుముందు టైటిల్ కొట్టినవారంతా కూడా కెరియర్ ని సరిగా ప్లాన్ చేసుకోలేదు. కానీ సన్నీ మాత్రం బిగ్ బాస్ క్రేజ్ ని సరైన ప్లానింగ్ తో వెళ్తున్నాడు. వెబ్ సీరీస్, కమిటైన రెండు సినిమాలు పూర్తయ్యాక ఓ పాపులర్ డైరక్టర్ తో సన్నీ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమాకు సంబందించిన డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: