తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ సంవత్సరం ఆగస్ట్ నెల బాగా కలిసి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో అనగా ఆగస్ట్ 5 వ తేదీన సీతా రామం మరియు బింబిసార మూవీ లు మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను సాధించాయి. దానితో ఈ సినిమాలకు కలెక్షన్ లు కూడా అదిరిపోయే రేంజ్ లో వస్తున్నాయి.

ఇప్పటికే ఈ రెండు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేసి విజయవంతమైన సినిమాలుగా నిలిచాయి. అలాగే ఈ రెండు సినిమాలు ప్రస్తుతం కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబడుతున్నాయి.  సీతా రామం సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా మృణాలిని ఠాగూర్ హీరోయిన్ గా నటించింది. సీతా రామం మూవీ కి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. బింబిసార మూవీ లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా కేథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. బింబిసార మూవీ కి మల్లాడి వసిష్ఠ దర్శకత్వం వహించాడు.  

ఇది ఇలా ఉంటే ఈ ఆగస్ట్ 13 వ తేదీన కార్తికేయ 2 మూవీ విడుదల అయ్యింది. ఈ మూవీ కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాదించింది.  ఈ సినిమా కూడా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి బాక్సా ఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. కార్తికేయ 2 మూవీ లో నిఖిల్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. కార్తికేయ 2 మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఇలా ఇప్పటికే ఈ నెలలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి 3 బ్లాక్ బస్టర్ మూవీ వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: