రాజకీయాల్లోకి రాకముందు.. సినీ రంగంలో అన్నగారు వెలిగిన వెలుగు అంతా ఇంతా కాదు. అయితే.. ఎంత మంచి ఉన్నా.. ఎక్కడో ఒక్కొక్క చోట చేసే చిన్నపాటి తప్పులు..
ఎంతటి వారినైనా ఇబ్బందులు పెడతాయి. ఇదే అన్నగారి సినీ జీవితంలోనూ జరిగింది. ఆయన కూడా కొన్ని కొన్ని సార్లు.. చెప్పుడు మాటలకు వశమయ్యారట. ముఖ్యంగా ఆయన నమ్మిన వారే.. ఆయనను తప్పుదారి పట్టించారని అంటారు. వాస్తవానికి డబ్బుల విషయంలో అన్నగారు.. చాలా తెలివిగా.. పొదుపుగా.. జాగ్రత్తగా ఉండేవారు.

అయితే.. కస్తూరి శివరావు. ఓల్డ్ హీరో. అన్నగారు సినీ రంగంలోకి వచ్చే సరికే.. ఆయన ఒక రేంజ్‌లో ఉన్నారు. హీరోగా నటిస్తున్నారు. విజయవాడ వాసి. దీంతో అన్నగారితో చనువు పెరిగింది. ఒకరకంగా.. చెప్పాలంటే.. అప్పట్లో కస్తూరి శివరావు రోల్ మోడల్‌. సినీమాల్లో నటించాలనుకునేవారు.. ఆయనను తరచూ కలిసి ఆశీర్వాదం తీసుకునేవారు. ఆయన కూడా వచ్చిన వారికి భోజన ఫలహారాలు.. రూంలు చూపించి ఆదుకునేవారు.

ఈ క్రమంలోనే ఆయన సంపాదించిన సొమ్మంతా ఖర్చు చేసుకున్నారు. అయితే.. తాను ఇబ్బందులు పడడం మాట అటుంచితే.. ఎవరిదగ్గరైనా.. డబ్బులు ఉన్నాయంటే.. కస్తూరి శివరావు.. వెంటనే వారిని పట్టుకునేవారట. వారితో ఆ డబ్బును ఏదో ఒక విధంగా ఖర్చు చేయించేవారట. అయితే.. ఒక్కొక్కసారి అది నష్టానికి దారితీసిన పరిస్థితి కూడా ఉందని అంటారు.

ఇక, శివరావుకు.. గుర్రం పందేలు వ్యసనం. తనతో ఉన్నవారిని కూడా వీటికి తీసుకువెళ్లేవారట.
ఇలా.. ఒకసారి అన్నగారిని బలవంతంగా.. రేస్ క్లబ్‌కు తీసుకువెళ్లిన శివరావు.. ఆయనతోనే గుర్రంపై పందేలు కట్టించారట. తొలి రెండు సార్లు ఒకింత రిటర్న్ రాగానే..అన్నగారు కూడా.. ఉత్సాహంగా..వచ్చిన మొత్తాన్ని ఆడేశారు. ఇంకేముంది.. చివరి గుర్రం.. ఓడిపోయింది.

ఫలితంగా వచ్చిన సొమ్ము.. తెచ్చుకున్న సొమ్ము అంతా పోయి.. అన్నగారు వారం పాటు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారట. ఇకపై ఎప్పుడూ.. ఆయన రేస్ క్లబ్ రోడ్‌లోకి కూడా వెళ్లలేదట. అటువైపు వెళ్లాల్సి వచ్చినా.. చుట్టూ తిరిగి వేరే మార్గంలో వెళ్లేవారట. కానీ, ఆ రోడ్డును మాత్రం టచ్ చేసేవారు కాదట. ఇదీ.. సంగతి!!

మరింత సమాచారం తెలుసుకోండి: