తెలుగు సినిమా రంగంలో విజయవంతమైన నిర్మాతలలో సీనియర్ అల్లు అరవింద్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అల్లు అరవింద్ తెరకెక్కించారు.
ఒక్క తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా అనేక సినిమాలు నిర్మించడం జరిగింది. నిర్మాతగా ఎన్నో విజయాలు అందుకున్న అల్లు అరవింద్ ప్రస్తుతం ఓటీటి రంగంలో “ఆహా” ద్వారా కూడా సత్తా చాటుతూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో తన తండ్రి స్వర్గీయ అల్లు రామలింగయ్య పేరిట స్టూడియో కూడా నిర్మించడం తెలిసిందే. ఈ స్టూడియో కి సంబంధించిన పనులు చాలా వేగవంతంగా జరగడంతో త్వరగానే కంప్లీట్ అయింది.

దీంతో ఇప్పుడు అల్లు స్టూడియో గ్రాండ్ గా లాంచ్ చేయటానికి అల్లుడు ఫ్యామిలీ రెడీ అయింది. ఈ స్టూడియోకి సంబంధించి ఓపెనింగ్ సెర్మని అదరగొట్టే రేంజిలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ స్టూడియోలో మొదటి సినిమా షూటింగ్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న “పుష్ప 2” తో స్టార్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా నెలలు “పుష్ప 2” స్క్రిప్ట్ పై సుకుమార్ వర్క్ చేసి ఫైనల్ చేయడం జరిగింది. “పుష్ప” మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుటంతో రెండో పార్ట్ మరింత అదిరిపోయే రేంజిలో ఉండాలని .. సుకుమార్, బన్నీ చాలా హోం వర్క్ చేశారు.
ఇక “పుష్ప” ద్వారా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సపరేటు ఇమేజ్ భారీ ఎత్తున విస్తరించడంతో దీన్ని సెంటిమెంట్ గా చేసుకుని తన స్టూడియోలో మొదటి సినిమా షూటింగ్…”పుష్ప 2″ ఉండే రీతిలో బన్నీ ప్లాన్ చేసుకున్నారట. మొదటి షెడ్యూల్ ఇక్కడ కంప్లీట్ చేసి మిగతా షెడ్యూల్ మొత్తం ఫారెస్ట్ లో చేయటానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో అల్లు స్టూడియోలో “పుష్ప 2” మొదటి షెడ్యూల్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు సమాచారం. స్టూడియో ఓపెనింగ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ఇంకా చరణ్ మరి కొంతమంది మెగా హీరోలను.. ఆహ్వానించే ఆలోచనలో అల్లు ఫ్యామిలీ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు స్టూడియో రంగంలో కూడా అల్లు ఫ్యామిలీ దిగటం ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: