ఆచార్య సినిమా చిరంజీవికి మంచి హిట్ టాక్ ను అందించ లేక పోయింది..దాంతో చిరు కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త వహించారు..మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు చిరు.దసరా కానుకగా గాడ్ ఫాదర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, థక్కర్ మార్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ కి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. రీసెంట్ గా ఈ సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.


అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నుంచి వదులుతున్న మెగాస్టార్ పోస్టర్లు అంతకంతకూ అంచనాలు పెంచుతున్నాయి ఇక ఈ లో లేడీ సూపర్ స్టార్ నయన తార చిరంజీవి సిస్టర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ ఓ ఇంట్రవ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సినిమాలో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ నటిస్తున్నారని తెలిపారు. ఒక యూట్యూబర్ పాత్రలో పూరీజగన్నాథ్ కనిపించనున్నారట.


అయితే ముందుగా కథ విన్నప్పుడు ఆ పాత్రలో పూరీ అయితేనే కరెక్ట్ అని భావించాం. అంతకు ముందు సోషల్ మీడియాలో పూరీ జగన్నాథ్ పాడ్ కాస్ట్ ను విన్నానని.. చాలా నచ్చాయని అందుకే ఈ పాత్ర గురించి చెప్పగానే పూరీ అయితే కరెక్ట్ అనుకున్నా అని అన్నారు..మొదట భయపడినా తర్వాత బాగా నటించారు.తన క్రేజ్‌ను మరో సారి అందరికీ దిమ్మతిరిగేలా రేంజ్‌లో చూపించబోతున్నారు మెగాస్టార్. అనంతపురాన్ని తన అడ్దాగా మార్చుకుని.. గాడ్ ఫాదర్ పేరును మారుమోగించనున్నారు. చిరు మోస్ట అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టంబర్ 28న అనంతపూర్‌లో నిర్వహించనున్నారు మేకర్స్..ఈ ఈవెంట్ కు గవర్నమెంట్ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌ వేదిక కానుంది.మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చే ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: