సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో అవమానాలు పడి నటుడుగా నిలబడ్డాడు నటుడు సంపూర్ణేష్ బాబు. అలా ఎంతో కష్టపడి హృదయ కాలేయం సినిమా తో బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా సక్సెస్ను అందుకున్నారు. అయితే ఆ తర్వాత కేవలం కథానాయకుడు గానే కాకుండా ,సపోర్టింగ్ రోల్స్ లో కూడా బాగానే నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఒకవైపు హీరోగా చేస్తూనే మరొకవైపు ఇతర హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు.


అలా 2015లో మంచు విష్ణు దర్శకత్వంలో సింగం-123 అనే సినిమాతో కాస్త బజ్ క్రియేట్ అయింది. అయితే మొదటి సినిమాకు వచ్చినంత సక్సెస్ మరే సినిమాకు రాలేదని చెప్పవచ్చు. ఇక తన మొదటి సినిమాని చేసిన డైరెక్టర్ తో కొబ్బరి మట్ట సినిమాని తెరకెక్కించగా పర్వాలేదు అనిపించుకున్నారు. కానీ ఆ తర్వాత ఎలాంటి సినిమా చేసిన కూడా అంతగా కలిసి రాలేదు. ప్రతి ఏడాది కూడా ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంపూర్ణేష్ బాబు చాలా డిఫరెంట్ పాత్రలు నటిస్తూ ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉండేవారు. అయితే అవి కూడా కాస్త రొటీన్ గా మారుతుండడంతో పెద్దగా సినిమాలు ఆకట్టుకోలేకపోతున్నాయి.


అయితే సంపూర్ణేష్ బాబు ఇతర పాత్రలు చేయాలి అంటే ఎవరైనా సరైన దర్శకులు చేతిలో పడితే కెరియర్ మారిపోతుందని చెప్పవచ్చు...చివరిగా సంపూర్ణేష్ బాబు నటించిన కాలీఫ్లవర్ బజార్ రౌడీ అనే సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ప్రస్తుతం ఒక కొత్త దర్శకుడు సరికొత్త సినిమాకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపించాయి. సంపూర్ణేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అందుకోలేకపోవడంతో కొత్త తరహా కథతో రాబోతున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఆడియన్స్ పై సంపూర్ణేష్ బాబు చూపించే ప్రేమకు ఫిదా అవుతూ ఉంటారు ప్రేక్షకులు. మరి సంపూర్ణేష్ బాబు తమ అభిమానుల కోసం ఎలాంటి సినిమాతో తిరిగి వస్తారు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: