మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన చిరంజీవి ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి ,  ఈ సంవత్సరం మరోసారి గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. గాడ్ ఫాదర్ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. 

మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా , సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. సల్మాన్ ఖాన్ ,  సత్య దేవ్ ,  నయన తారమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని కొన్ని రోజుల క్రితమే మూవీ యూనిట్ విడుదల చేసింది. మూవీ తెలుగు ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ ని తెలుగు తో పాటు హిందీ లో కూడా విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా హిందీ ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ తాజాగా విడుదల చేసింది. గాడ్ ఫాదర్ మూవీ హిందీ ట్రైలర్ ని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తూ ఉండడంతో ,  ఈ మూవీ పై హిందీ సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: