మొదటి సారిగా ఓటిటిలో  నాన్-స్టాప్  ప్రత్యక్ష ప్రసారంగా మొదలు పెట్టిన బిగ్ బాస్ విజేతగా  బిందు మాధవి (Bindu Madhavi) నిలిచింది.


ఆమె తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటించి పాపులర్ నటి కూడా అయింది.


ఆమె ఇలా ఓటిటిలో లో మొదలు పెట్టిన మొదటి బిగ్ బాస్ విజేత గా నిలిచింది. బిందు మాధవి తెలుగు బిగ్ బాస్ విజేత అయినా, ఆమెకి తెలుగు సినిమా లో చేసే అవకాశం ఆమె విజేతగా నిలిచిన తరువాత అయితే రాలేదు. ఆమె ఇప్పుడు ఏవో కొన్ని తమిళ సినిమాల్లో చేస్తూ వుంది.


తెలుగులో మాత్రం ఏమి చేయటం లేదు. బిగ్ బాస్ విజేతగా నిలిచినా కూడా ఆమెకి తెలుగులో అవకాశాలు రాకపోవటం కొంచెం ఆశ్చర్యంగానే వుందట.. అదే బిగ్ బాస్ ఇంట్లో వున్న కొంతమంది నటులకి తెలుగులో మంచి అవకాశాలు అయితే వచ్చాయి. అలాగే విజేత కాకపోయినా చిరంజీవి (Mega Star Chiranjeevi) లాంటి నటుడిని మెప్పించిన దివి (Bigg boss fame Divi) అనే అమ్మాయి ఈమధ్య విడుదల అయిన 'గాడ్ ఫాదర్' (GodFather) చిత్రం లో చిన్న రోల్ సంపాదించటమే కాకుండా, చిరంజీవి నటిస్తున్న తరువాతి సినిమాలో కూడా దివి చేస్తోందట.కానీ మరి బిగ్ బాస్ విజేత అయిన బిందు మాధవి కి ఇక్కడ తెలుగు లో రాకపోవటం ఏంటి, మన తెలుగు దర్శకులు చూడలేదా, లేక బిందు మాధవి తెలుగులో వద్దనుకుంటోందా? గతంలో కథానాయకురాలు గా చేసిన బిందు మాధవి, ఇప్పుడు ఏమైనా సపోర్టింగ్ రోల్ వొప్పుకోవటం లేదా? అనే మాటలు కూడా వినపడుతున్నాయి. ఇప్పటి నటీ నటులు ఒక్క కథానాయకుడు/నాయకురాలు పాత్రలే కాకుండా, బాగుంటే ఎటువంటి పాత్రను చేయడానికి అయిన సిద్ధం అవుతున్నారట.


సత్యదేవ్ (Satya Dev of 'GodFather fame) ని చూస్తే నే అర్థం అవుతుంది. ఒక పక్క కథానాయకుడిగా చేస్తూనే, ఇంకో పక్క 'గాడ్ ఫాదర్' లాంటి సినిమాలో ఒక విలన్ పాత్ర వస్తే చేశాడు, మెప్పించాడు కూడా. అందువల్ల మంచి పాత్రలు వచ్చినప్పుడు, అది మెయిన్ లీడ్ అవ్వకపోయినా కానీ చేయటం వల్ల మంచి పేరు కూడా వస్తుంది. అలాగే బిందు మాధవికి తెలుగు లో కూడా మంచి అవకాశాలు వస్తాయని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: