నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేయగా ,  అందులో బాలకృష్ణ తన అద్భుతమైన ఫైట్ లతో ,  అద్భుతమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించాడు. చిత్ర బృందం విడుదల చేసిన ఈ టీజర్ అద్భుతమైన రీతిలో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.  

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  వరలక్ష్మీ శరత్ కుమార్మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా ,  దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ కి మూవీ యూనిట్ టైటిల్ ని ఖరారు చేయలేదు. దానితో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 వ సినిమాగా రూపొందుతూ ఉండడంతో ,  ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ ప్రకటనకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్ బి కె 107 మూవీ కి రెడ్డి గారు అనే టైటిల్ ని చిత్ర బృందం ఖరారు చేసినట్లు ,  ఈ టైటిల్ ను వచ్చే శనివారం రోజు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ,  ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: