సింగర్ సునీత.. పరిచయం అవసరం లేని పేరు..ఎన్నో సినిమాలకు తన గాత్రాన్ని అందించింది.. ఆమె గొంతులోనుంచి వచ్చిన స్వరాలు ఎప్పటికీ బోర్ కొట్టవు.. అందుకే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. .ఎప్పుడూ తన పనేంటో తాను చేసుకుంటూ వస్తుండేది.కానీ ఈ మధ్య ఆమె రెండో పెళ్ళి చేసుకుంది..పెళ్ళై చాలా కాలం అయినా కూడా ఇప్పటికీ ట్రోల్స్ ఆగలేదు..ఏదొక రకంగా నెటిజన్లు ఆమెను ఆడేసుకుంటున్నారు.


తాజాగా మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది..ఆమెకు చిన్న వయస్సులోనే పెళ్లైపోయింది. ఇద్దరు పిల్లల తల్లి కూడా.. అయితే భర్తతో విబేధాల నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చాలా యేళ్ల పాటు అలా ఉండిపోయారు. తనలో తాను తీవ్ర మనోవేదనకు కూడా గురయ్యారు. ఇక టాలీవుడ్ బిజినెస్ మ్యాన్ మ్యాంగో రామ్ - సునీత ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు.


లేటు వయస్సులో ఒకరికి ఒకరు తోడు ఉండాలనే వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. రామ్‌కు కోట్లాది రూపాయల వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నడి వయస్సులో ఉన్న ఈ దంపతులిద్దరు కలిసి తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారు. అందుకే సునీతకు రీకానలైజేషన్ సర్జరీ చేయించారన్న పుకార్లు అప్పట్లో బయటకు వచ్చాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఆమె తల్లి కాబోతున్నట్టు తెలుస్తోంది.


ఏదేమైనా ఇది సునీత కుటుంబానికి చెందిన వ్యక్తిగత వార్త అయినా సునీతకు ఉన్న అశేష అభిమానులకు కూడా ఇది గుడ్ న్యూస్‌. ఇక సునీత కూడా ఇంత సంతోషకరమైన వార్తను ఇంట్లో సెలెబ్రేట్ చేసుకుంటూన్నారని తెలుస్తుంది..ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడం నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వయస్సు లో అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా ఈ వార్త పై సునీత స్పందించలేదు..దీని గురించి పూర్తీ వివరాలు తెలియాలంటే ఆమె క్లారిటీ ఇచ్చే వరకూ ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: