తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి విష్ణు విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విష్ణు విశాల్ తాజాగా మట్టి కుస్తీ అనే మూవీ లో హీరో గా నటించాడు. చెల్ల అయ్యవు డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ ని హోం బ్యాన‌ర్లు ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ పై  విష్ణు విశాల్‌ , ర‌వితేజ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన తెలుగు భాషలో కూడా భారీ ఎత్తున విడుదల చేయడానికి మూవీ యూనిట్ ప్లాన్స్ వేస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఒక పాటను కూడా విడుదల చేసింది. 

వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా మట్టికొస్తే మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా మట్టి కుస్తీ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ సాంగ్ విడుదల తేదీని ప్రకటించింది. మట్టి కుస్తీ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "పోకిరోడే" అనే సెకండ్ సింగిల్ సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ ని మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంతరాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: