పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.. సినిమాల్లో ఖాళీ సమయం దొరికితే మాత్రం జనాల కష్టాల ను తెలుసుకోవడానికి వెళ్తారు.. జనాల్లొ జనసేన పై నమ్మకాన్ని కలిగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ను అధికారం లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ పై నిప్పులు చెరుగుతున్నారు పవన్. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో కి వచ్చానని.. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండేది లేదని పవన్ తన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు.


పవన్ సీఎం కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాగే అభిమానులు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. పవన్ వస్తే తప్పకుండా రాజకీయాల్లో మార్పులు వస్తాయని అంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య. పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన మనసు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. ఇద్దరు కలిసి చాలా కాలంగా జర్నీ చేస్తున్నాం. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు నేను గర్వంగా ఫీలవుతాను` అని అన్నారు. సూర్య వ్యాఖ్యల తో పవన్ అభిమానులు సంబరపడుతున్నారు. అతన్ని పొగిడేస్తున్నారు.


పవన్, సూర్య కలిసి నటించిన సినిమా అంటే ఖుషి.. సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఈ ఇద్దరి కాంబోలో కొమరం పులి అనే కూడా వచ్చింది. కానీ ఈ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు సూర్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర లో కనిపించనున్నారు. ఇకపోతే పవన్ సినిమాల విషయాన్నికొస్తే.. హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది... వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: