ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్నో సినిమాలు విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సాధిస్తే , మరికొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను సాధించిన టాప్ 3 తెలుగు సినిమాల గురించి తెలుసుకుందాం.

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తేరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను అందుకుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి టాప్ గ్రాఫర్ మూవీ గా నిలిచింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ఈ సంవత్సరం టాప్ 2 గ్రసర్ మూవీ గా నిలిచింది. సర్కారు వారి పాట సినిమా ప్రపంచ వ్యాప్తంగా 224 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన మూవీ లలో సెకండ్ ప్లేస్ లో నిలిచింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ లలో 3 వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 176 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: