తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ ఆఖరుగా బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. పూజ హెగ్డేమూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ఒకే రోజు విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన బీస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. ఇలా బీస్ట్ లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత దళపతి విజయ్ "వరసు" మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే వరిసు మూవీ నుండి రంజితమే అనే తమిళ్ వర్షన్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ రంజితమే తెలుగు వర్షన్ సాంగ్ ను నవంబర్ 30 వ తేదీన ఉదయం 9 గంటల 9 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో దళపతి విజయ్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన  ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: