తమిళ సినిమా ఇండస్ట్రీ లో రాక్షసన్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న విష్ణు విశాల్ తాజాగా గట్టా కుస్తీ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. గట్టా కుస్తీ మూవీ ని తెలుగు లో మట్టి కుస్తీ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తమిళ్ మరియు తెలుగు భాషలలో డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని మాస్ మహారాజ రవితేజ సమర్పిస్తున్నాడు. 

మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా మట్టి కుస్తీ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. మట్టి కుస్తీ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మూడవ సింగల్ విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. ఈ మూవీ నుండి "తానే చిన్నది" అనే పాటను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. మట్టి కుస్తీ మూవీ కి చెల్ల అయ్యవు దర్శకత్వం వహించగా , ఐశ్వర్య లక్ష్మి ఈ మూవీ లో విష్ణు విశాల్ సరసన హీరోయిన్ గా నటించింది. జస్టిన్ ప్రభాకరన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే విష్ణు విశాల్ "మట్టి కుస్తీ" మూవీ తో ఏ రెంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: