నటసింహ నందమూరి బాలకృష్ణ మరియు యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్‌లో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. 'వీర సింహా రెడ్డి'.. ఫస్ట్ టైం శృతి హాసన్, బాలయ్యకి జోడీగా అయితే నటిస్తోంది. లాల్, 'దునియా' విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజు కీలకపాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తుంది.. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. సంక్రాంతికి సినిమాని బాక్సాఫీస్ బరిలో దింపడానికి ఫుల్ జోష్‌తో పనిచేస్తోంది మూవీ టీం. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీస్థాయిలో అయితే జరిగింది.

ఇటీవల జరిగిన ఫైట్‌తో 'దునియా' విజయ్ చేస్తున్న ప్రతాప్ రెడ్డి పాత్రకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిందని.. చివరి రోజు సెట్ నుండి వెళ్తూ విజయ్ భావోద్వేగానికి గురయ్యాడని వార్తలు కూడా వస్తున్నాయి.. విజయ్.. కన్నడలో స్టార్ హీరో.. తెలుగులో ఇదే మొదటి సినిమా.. 'దునియా' అతని కెరీర్‌ని మలుపు తిప్పింది. దాంతో 'దునియా' విజయ్‌గా కన్నడ ప్రేక్షకాభిమానుల మనసుల్లో నిలిచిపోయాడు.. నటుడిగానే కాకుండా.. రచయిత, దర్శకుడు, నిర్మాతగానూ ఆకట్టుకున్నాడు.. ఆయన కేవలం బాలయ్య కోసమే 'వీర సింహా రెడ్డి' లో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నాడని తెలుస్తుంది.

''బాలయ్య నాకు దేవుడిచ్చిన అన్నయ్య.. ఆయన కోసమే 'వీర సింహా రెడ్డి' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించడానికి ఒప్పుకున్నానని బాలయ్య సింహం లాంటి మనిషి.. ఆయన వ్యక్తిత్వం ఎవరిలోనూ కూడా చూడలేదు.. షూటింగ్ అప్పుడు ఆయనతో పంచుకున్న అనుభవాల గురించి మాటల్లో చెప్పలేను.. చెప్పడానికి మాటలు చాలవు.. నటసింహ నట విశ్వరూపం చూస్తారు ఇందులో.. సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అయితే అవుతుంది.. నాకు మంచి పేరు తీసుకొస్తుంది'' అని చెప్పినట్టు వార్తలు వైరల్ కూడా అవుతున్నాయి..

ఇటీవల 'జై బాలయ్య' మాస్ ఆంథెమ్ రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 12 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. 'వీర సింహా రెడ్డి' క్యారెక్టర్‌ని హైలెట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స రాయగా.. థమన్ మరోసారి తన స్టైల్లో అయితే చెలరేగిపోయాడు.. లిరికల్ వీడియోలో డిఫరెంట్‌గా కనిపించి సర్‌ప్రైజ్ చేశాడట థమన్..

మరింత సమాచారం తెలుసుకోండి: