టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ సేన్ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. విశ్వక్ సేన్ ఆఖరుగా ఓరి దేవుడా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఆశ్విత్ మరి ముత్తు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో మిథాలీ పాల్కర్ , విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే విశ్వక్ సేన్ ప్రస్తుతం  ధమ్కీ అనే పక్కా మాస్ కమర్షియల్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో విశ్వక్ సేన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. 

మూవీ లో విశ్వక్ సేన్ సరసన నివేతా పేత్ రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరూ కలిసి పాగల్ అనే మూవీ లో కలిసి నటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల" అనే సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ ను మొదట డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఆ తర్వాత ఈ మూవీ లోని ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల సాంగ్ ను డిసెంబర్ 5 తేదీన కాకుండా డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: