తెలుగు కమెడియన్ ప్రభాస్ శ్రీను గురించి అటు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్క లేదు అని చెప్పాలి.  సీతయ్య సినిమాతో కమెడియన్ గా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ప్రభాస్ శ్రీను ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రభాస్ కు మిత్రుడు అయిన శ్రీను అతని అసిస్టెంట్గా చేరి ఇక ప్రభాస్ శ్రీనుగా పాపులర్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే . అందుకే ప్రభాస్ శ్రీను ఏదైనా సినిమాలో కనిపించాడంటే చాలు ఇక డార్లింగ్ అభిమానులు సైతం అతని ఆదరిస్తూ ఉంటారు అని చెప్పాలి. ప్రభాస్ తో పాటే అటు శ్రీను కూడా యాక్టింగ్ నేర్చుకున్నాడు అని చెప్పాలి. ఇక ప్రభాస్ స్టార్ అయిన తర్వాత ఇక తన స్నేహితుడు శ్రీనుని పక్కనే ఉంచుకొని అతన్ని నటుడిని చేసి ఇక మంచి కమెడియన్ గా గుర్తింపు వచ్చేలా చేశారు అని చెప్పాలి. ఇక ప్రభాస్ ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే చాలు అందులో శ్రీను తప్పకుండా ఉంటాడని ప్రేక్షకులు భావించేలా ఇక వీరిద్దరి ఫ్రెండ్షిప్ కొనసాగింది. అయితే ఇటీవల కాలంలో ప్రభాస్ శ్రీను ప్రభాస్ మధ్య గొడవలు జరిగాయి అన్న ప్రచారం కూడా తెరమీదకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన కొన్ని సినిమాల్లో శ్రీను కనిపించకపోవడం కూడా ఈ వార్తలకు ఎంతగానో బలం చేకూర్చింది అని చెప్పాలి. అయితే అలాంటి గొడవలు ఏమీ లేవని ఇప్పటికి మేము మంచి స్నేహితులుగానే ఉన్నాం అంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చాడు.


  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఏకంగా ప్రభాస్ బలహీనతలను బయటపెట్టాడు అతని స్నేహితుడు శ్రీను. ప్రభాస్ ఎలాంటి సిచువేషన్ లో అయినా ఒకేలా ఉంటారట. పరిస్థితులకు అనుగుణంగా మారడం ప్రభాస్ కి అలవాటు లేదని శ్రీను చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఎవరైనా ఏదైనా అడిగితే మొహమాటంతో ప్రభాస్ నో చెప్పడం చాలా తక్కువగా చూసానని తెలిపాడు. ఇటీవల సీనియర్ నటి తులసి తో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చాడు ప్రభాస్ శ్రీను. ఈ సందర్భంగా ఇక ప్రభాస్తో గొడవల గురించి ఆలీ ప్రశ్నించగా తాము ఇప్పటికి మంచి ఫ్రెండ్స్ గా ఉన్నామని చెబుతూనే... ఇక ప్రభాస్ అందరితో ఎలా ఉంటాడు అనే విషయాలను చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: