ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న అలీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే ఇక ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. కేవలం కమెడియన్ గా మాత్రమే కాదు హీరోగా కూడా కొన్ని సినిమాలో నటించి మంచి విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అయితే కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అవుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 అయితే ఇలా కమెడియన్ పాత్రలు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాదు బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి వ్యాఖ్యాతగా అవతారమెత్తి ఇక సరికొత్తగా ప్రేక్షకులను అలరించడం మొదలుపెట్టాడు. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ఏపీలో వైసీపీ పార్టీకి మద్దతుగా నిలిచిన అలీ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జిగా పదవి బాధ్యతలు చేపట్టి ఇక రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతూ ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు.



 అయితే ఇప్పుడు వరకు 1200 కు పైగా సినిమాల్లో నటించిన కమెడియన్ అలీ ప్రేక్షకులను అలరించి గుర్తింపు సంపాదించుకోవడమే కాదు.. ఇక వందల కోట్ల ఆస్తులను కూడా వెనకేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ప్రకారం కమెడియన్ ఆలీ ఆస్తుల విలువ 850 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. ఇక ఇప్పుడు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా మారిన తర్వాత మరింత ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే అలీ సినిమాల్లో ఒక్కో సంవత్సరానికి దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తూ ఉంటాడట. ఇక వ్యాపారాల్లో వచ్చే ఆదాయం అదనం. ఇటీవలే తన పెద్ద కుమార్తె వివాహాన్ని అలి ఎంత ఘనంగా నిర్వహించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: