టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన బోయపాటి శ్రీను గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సాధారణంగా బోయపాటి శ్రీను తన సినిమాలలో విలన్లను చాలా పవర్ ఫుల్ గా చూపిస్తారు. ప్రస్తుతం ఈయన హీరో రామ్ తో అత్యంత భారీ బడ్జెట్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇలా ఉంటే  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా ప్రిన్స్ ను కన్ఫామ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రిన్స్నో పవర్ఫుల్ విలన్ గా బోయపాటి శ్రీను ఈ సినిమాలో చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఇండస్ట్రీలో ప్రిన్స్ చాలా సంవత్సరాల నుండి ఉన్నాడు. 

ఎన్నో సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సరైన సక్సెస్ను అందుకోలేదు. ఇక ఈ వార్త విన్నానంతరం చాలామంది నటిజన్స్ బోయపాటి శ్రీను వల్ల విలన్ గా అయినా ప్రిన్స్ జాతకం మారుతుంది అని భావిస్తున్నారు.ఇదివరకు బోయపాటి శ్రీను వల్ల చాలామంది హీరోలు మరియు స్టార్ హీరోలు విలన్లుగా మరి మంచి గుర్తింపును పొందారు. అంతేకాదు స్టార్ విలన్లుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. జగపతిబాబు శ్రీకాంత్ ఇలా చాలామందికి విలన్లుగా మంచి గుర్తింపు రావడానికి ముఖ్య కారణం బోయపాటి శ్రీను అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా బోయపాటి శ్రీను హీరోలకు దీటుగా విలన్ రోల్స్ ఉండేలా  ఎంచుకుంటూ ఉంటారూ. ఈ విషయంలో బోయపాటి శ్రీను చాలా జాగ్రత్తలు వహిస్తాడు.

 ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలో రామ్ సైతం సరికొత్త లుక్ లో కనిపిస్తాడు అని తెలుస్తోంది. ఏకంగా 70 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పెరగా ఎక్కించడం జరుగుతుంది. బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో రామ్ ఈ సినిమాతో అయినా సక్సెస్ బాట పడతారు అని చాలామంది భావిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో రామ్కీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కుతుంది అని అంటున్నారు. ప్రస్తుతం రామ్ ఒక్కో సినిమాకి గాను 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా సమాచారం. బోయపాటి శ్రీను మరియు రామ్ కాంబినేషన్లో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు రామ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: