
సహజ సిద్ధమైన అందాల మహారాణిల గోదావరి అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఇప్పుడైతే ప్రకృతి అందాలు అంటూ ఎక్కువగా విదేశాలు చుట్టూ తిరుగుతున్నారు. కానీ గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం వరకు సినిమా షూటింగులు అనగానే ఎక్కువగా గ్రామీణ నేపథ్యం సినిమాలు అంటే దర్శకనిర్మాతలకు ముందుగా గుర్తుకు వచ్చేది. మన గోదావరి నది తీర ప్రాంతము రాజమండ్రి అందాల లొకేషన్స్ అని చెప్పవచ్చు. నది తీరం వద్ద బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు తెరకెక్కించారు.
అందులో దర్శకత్వం దిగ్గజ ధీరుడు కళాతపస్వి కే విశ్వనాథ్ కూడా ఒకరని చెప్పవచ్చు.. గౌతమి నది ఒడ్డున ఒక కుటీరం రాజమండ్రిలో కొన్ని సన్నివేశాలు కచ్చితంగా విశ్వనాథ్ గారి సినిమాలలో ఉండనే ఉంటాయని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్రాంతంనికి విశ్వనాథకు ఎనలేని అనుబంధం కూడా ఉన్నదని అంతేకాకుండా తన సినిమాలలో ఒక సన్నివేశం తీయడం ఆయనకు సెంటిమెంటు అని సమాచారం.విశ్వనాథ్ కెరియర్ లో స్పెషల్గా తెరకెక్కించిన శంకరాభరణం, సాహసూత్రదారులు స్వాతిముత్యం ,ఆపద్బాంధవుడు ,సిరిసిరిమువ్వ, సరదా వంటి అనేక చిత్రాల సినిమా షూటింగులు ప్రాంతాలు కూడా ఇక్కడే జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన నటీనటులు కళాకారులనే కాకుండా నది తీరాన గోదావరి తల్లితో ఒక ప్రత్యేకమైన బంధం ఉందని చెప్పవచ్చు. ఇక ఇలాంటి సన్నివేశాలను స్టూడియోలో పలు సందర్భాలలో వీటి గురించి తెలియజేసినట్లు తెలుస్తోంది.