సాదరణంగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ప్రేక్షకుల మధిలో చిరస్థాయిగా స్థానం సంపాదించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. తమ అందం అభినయంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. ఇక అలాంటి హీరోయిన్లలో లయ కూడా ఒకరు. స్వయంవరం అనే సినిమాతో 1999లో హీరోయిన్గా ఇండస్ట్రీకిలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగు ప్రేక్షకులు చూపును తన వైపుకు తిప్పుకుంది. అంతేకాదు తొలి సినిమా సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకు అప్పుడు ప్రతిష్టాత్మకమైన అవార్డుగా ఉన్న నంది అవార్డును కూడా గెలుచుకుంది.


 మొదటి సినిమాకు మాత్రమే కాదండోయ్.. ఆ తర్వాత లయ నటించిన మనోహరం, ప్రేమించు సినిమాలకు సైతం ఇలా నంది అవార్డులను కైవసం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. దాదాపు 13 ఏళ్లపాటు ఇండస్ట్రీలో హీరోయిన్గా హవా నడిపించింది అని చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుని చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమైపోయింది అని చెప్పాలి. కుటుంబానికే తన టైం మొత్తం కేటాయించింది. ఒక ఇటీవలే లయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.



 నా కెరియర్ మంచి పొజిషన్లో ఉన్నప్పుడే నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. అయితే పెళ్లి తర్వాత ఆయన ఎప్పుడు కూడా సినిమాలు చేయొద్దు అని చెప్పలేదు. కానీ ఎందుకో పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉండడం జరిగిపోయింది. ఇప్పటికీ నా రీల్స్ ఫోటోలు అన్నీ ఆయనే తీస్తాడు. నా భర్త నన్ను అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాడు. ఆయన లేకుండా నేనేం చేయలేనేమో అని అనిపిస్తూ ఉంటుంది.  కానీ కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి ఒక పొజిషన్ వచ్చాక మాత్రం అన్ని వదిలేసుకొని వెళ్లిపోవడం మాత్రం ఎంతో కష్టం. కుటుంబాన్ని సినిమాలను బాలన్స్ చేసుకోగలను. కానీ మా ఆయన యూఎస్ లో ఉండడంతో దూరం పెరిగింది. ఇండియాకు యుఎస్ మధ్య తరచు ప్రయాణం చేయడం కష్టం. అందుకే సినిమాలకు దూరమయ్యాను అంటూ లయ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: