నాచురల్ స్టార్ నాని తాజాగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో సంతోష్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

 ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్ లను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది. అలాగే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి కూడా అద్భుతమైన రీతిలో ఉండడంతో ఈ మూవీ పై ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఈ సినిమా మీడియం రేంజ్ హీరోలలో ఫస్ట్ డే ఏ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో అని చాలా మంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలలో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. మరి ప్రస్తుతం నాని హీరోగా రూపొందిన దసరా మూవీ పై ఉన్న అంచనాలు బట్టి చూస్తే ఈ సినిమాకు గనుక విడుదల అయిన మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే ఈ సినిమా అవలీలగా 25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను మించి వసూళ్లను రాబట్టే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: